Header Banner

వినియోగదారులకు ChatGPT బిగ్ షాక్! తీవ్ర అంతరాయం.. అసలు కారణం ఏంటంటే?

  Tue Jun 10, 2025 18:20        Technology

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులను ఆకర్షించిన కృత్రిమ మేధస్సు (AI) చాట్‌బాట్ చాట్ జీబీటీ (ChatGPT) సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. అమెరికా, భారతదేశంతో సహా పలు దేశాల నుండి వినియోగదారులు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చాట్ జీబీటీ సేవలు నిలిచిపోవడంతో రోజువారీ పనులు, అకడమిక్ ప్రాజెక్టులు, మరియు వృత్తిపరమైన కార్యకలాపాలకు AIపై ఆధారపడిన అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఓపెన్ AI (OpenAI) అభివృద్ధి చేసిన చాట్ జీబీటీ, సంభాషణ నైపుణ్యాలతో పాటు, కంటెంట్ సృష్టి, కోడింగ్, సమాచార శోధన వంటి అనేక పనులకు విస్తృతంగా ఉపయోగించబడుతోంది. సేవల్లో అంతరాయం ఏర్పడటంతో, వినియోగదారులు చాట్‌బాట్‌ను యాక్సెస్ చేయలేకపోవడం, ప్రశ్నలకు సమాధానాలు రాకపోవడం, లేదా ఆలస్యంగా స్పందించడం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికల్లో #ChatGPTDown అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది.



ఇది కూడా చదవండి: ఏపీలో తల్లికి వందనం పథకం! ఈ మూడు పనులు చేయకపోతే రూ.15వేలు కట్, ఇలా చెక్ చేస్కోండి!

 

తొలిసారిగా, చాట్ జీబీటీ వెబ్‌సైట్ , APIలో ఒకేసారి అంతరాయం ఏర్పడింది. ఓపెన్ AI సంస్థ సాంకేతిక సమస్యను గుర్తించి, దానిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో సేవలు పునరుద్ధరించబడతాయని ప్రకటించింది. ఈ సంఘటన AI సేవలను నిరంతరం అందుబాటులో ఉంచాల్సిన ఆవశ్యకతను, సాంకేతిక లోపాలు వినియోగదారులపై చూపే ప్రభావాన్ని మరోసారి గుర్తుచేసింది. సాంకేతిక సమస్యల కారణంగా ఈ అంతరాయం సంభవించినట్లు ChatGPT యాజమాన్యం ప్రకటించింది.



ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

ఆ భారీ ప్రాజెక్టు పై దృష్టి పెట్టిన ఏపీ ప్రభుత్వం! మహారాష్ట్ర ప్లాంట్‌ను పరిశీలించిన మంత్రి!

 

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్! రూ.50 లక్షల విరాళం...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

బడ్జెట్ ట్రావెల్ కు బెస్ట్ డెస్టినేషన్లు! టాప్ 10 దేశాలు ఇవే! రోజుకి కేవలం..

 

ఆ పుణ్యక్షేత్రానికి రెండు వందే భారత్ రైళ్లు! రూట్ అండ్ టైమింగ్స్ ఇవే!

 

ఆధార్ కార్డులో ఈ తప్పులు ఉంటే వాటికి అనర్హులు! వెంటనే సరి చేసుకోండి!

 

ఆ ఇద్దరు వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన జగన్! పార్టీ నుండి సస్పెన్షన్ వేటు..

 

 చంద్రబాబు కీలక ప్రకటన! తల్లికి వందనం ముహూర్తం ఫిక్స్!

 

మహిళలను కించపరిస్తే సహించం - క్షమాపణలు చెప్పాలి.! లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!

 

రైతులకు శుభవార్త! తక్కువ వడ్డీతో రూ.3 లక్షల లోన్!

  

ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!

 

అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?

 

ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!

  

తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!

 

నేడు (10/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #chatgpt #technology #latestnews #breakingnews #Big shock #Severe disruption